Thursday, 26 November 2015

గజల్ నెం :3

//ఏమి రాయాలి //

నిశ్శబ్దం నను నిలదీస్తుంటే ఏమిరాయాలి మౌనం నన్నే వంచిస్తుంటే ఏమిరాయాలి సంకోచం నను చుట్టేస్తుంటే అడుగేపడునా ఆలశ్యం నను అదిమేస్తుంటే ఏమిరాయాలి కలకలమేనను కమ్ముకునుంటే కనురెప్పే మూసి సంకల్పంనను అడ్డేస్తుంటే ఏమిరాయాలి భయమే నన్ను వెంటాడేస్తే బతికే దెలాగ నిజమే నన్ను బెదిరిస్తుంటే ఏమిరాయాలి రాజేంద్రుని గుండెలలోన గుబులేరేగా కలమే ఉరకలు వేసేస్తుంటే ఏమిరాయాలి


Tuesday, 20 October 2015

గజల్ నెం :1
(ఈ సారి ఇది గజల్ అవుతుందని ఆశిస్తున్నా 
బాగుంటే అందరూ ప్రోత్సహించండి మరో గజల్ రాయటానికి )

బొబ్బట్టులు  తింటావా -ఓ  చిన్నీ  చిన్నారి .. !
బుంగమూతి పెడతావా  - ఓ చిన్నీ చిన్నారి .. !

పూతరేకు కావాలని అల్లరేల బంగారూ .. !
నాన్న మీద అలిగావా  - ఓ చిన్నీ  చిన్నారి .. !

కాజు బర్ఫీ దేముందీ చిటికలోన తెస్తాగా .. !
కస్సు బస్సు లాడేవా  - ఓ చిన్నీ  చిన్నారి.. ! 

పిస్తా పప్పు తేవాలా  -  గొడవెందుకు పోదాం రా ! 
పెచీగా చూస్తావా  - ఓ చిన్నీ  చిన్నారి .. !

మామిడి పండేమిటి  - ఏదైనా ఇస్తాగా .. ! 
ఒక చిన్ని ముద్దీవా  -ఓ చిన్నీ  చిన్నారి 

- గరిమెళ్ళ గమనాలు 





Friday, 29 May 2015

గజల్ నెం :2

అందమయిన మనసున్న నా ముద్దుగుమ్మ 
ఇంతలోనే ముళ్ళులాంటి  అలక ఎందుకమ్మా  

ఒక్కసారి మాటలాడు  నా ముద్దుగుమ్మ 
రాలలేని ముత్యాలకు మౌనం ఎందుకమ్మా 

నీనవ్వుతోటి కవ్వించే నా ముద్దుగుమ్మ 
చెంతకొస్తే చూడలేని చిరాకు ఎందుకమ్మా 

హంసలాంటి నడకున్న నా ముద్దుగుమ్మ 
నీఅడుగుల సవ్వడిలో నిశబ్దం ఎందుకమ్మా 

నీకళ్ళలోన ప్రేమదాచే నా ముద్దుగుమ్మ
మనసుచాటు దాగియుండే ప్రేమ ఎందుకమ్మా