//గజల్ -4// తుళ్ళిపడే తత్వంలో ఆరాటం ఉంటుంది ఎగసిపడే పరువంలో ఓ ప్రణయం పుడుతుంది నువు నిండిన తలపులలో వలపెంతో దాగున్నది చెలిమిలోని సంపదలో సంతోషం ఉంటుంది మెత్తనైన కౌగిలిలో విరహాలే పోవునులే మధురమైన స్వప్నంలో చెలిరూపం ఉంటుంది పరితపించు నా మనసుకి నీవిలువే తెలుస్తుంది నిరీక్షించు సమయంలో ఒక దుఃఖం ఉంటుంది ....... - గరిమెళ్ళ గమనాలు