గజల్ నెం :1
(ఈ సారి ఇది గజల్ అవుతుందని ఆశిస్తున్నా
బాగుంటే అందరూ ప్రోత్సహించండి మరో గజల్ రాయటానికి )
బొబ్బట్టులు తింటావా -ఓ చిన్నీ చిన్నారి .. !
బుంగమూతి పెడతావా - ఓ చిన్నీ చిన్నారి .. !
పూతరేకు కావాలని అల్లరేల బంగారూ .. !
నాన్న మీద అలిగావా - ఓ చిన్నీ చిన్నారి .. !
కాజు బర్ఫీ దేముందీ చిటికలోన తెస్తాగా .. !
కస్సు బస్సు లాడేవా - ఓ చిన్నీ చిన్నారి.. !
పిస్తా పప్పు తేవాలా - గొడవెందుకు పోదాం రా !
పెచీగా చూస్తావా - ఓ చిన్నీ చిన్నారి .. !
మామిడి పండేమిటి - ఏదైనా ఇస్తాగా .. !
ఒక చిన్ని ముద్దీవా -ఓ చిన్నీ చిన్నారి
- గరిమెళ్ళ గమనాలు