Wednesday, 9 November 2016

//గజల్ - 8 //

సమయమెంత  మధురము నిను  కలిసిన  క్షణము
 నా చిట్టిగుండె  పదిలము  నీవున్నంత కాలము

నా  కనులకెంత  పుణ్యము  నీ దర్శన భాగ్యము



Wednesday, 2 November 2016

//గజల్ -7 //

నిజమైన  ప్రేమలు బంధాలను  కలుపునేమో  తెలియదు
పేస్బుక్  ప్రేమలు మాత్రం  కలివిడిగా  వికసించును

ఒకరంటే  ఒకరికి  ఎంతమక్కువో  తెలియదు
పేస్బుక్ లోన  పలకరింపులు  వాయనంగా  తరలివచ్చును

ఇంటి  వ్యవహారములు  పట్టక  అటకెక్కును
పేస్బుక్ వారి  విషయములందు  ఆసక్తి  పెరుగును




//గజల్ -6 // 


నువ్వుంటే  దీపావళి  నా  రెండుకళ్లకి 
నువ్వుంటే  దీపావళి  నా  నిండుమనసుకి 

నీలాకాశంలో  మెరిసెను  తారాజువ్వలు 
నాహృదయాకాశంలో   మెరిసెను  నీచిరునవ్వులు 

విశ్వంలోకి   దూసుకెళ్లెను  ఆ  రాకెట్ నీడలు 
నావిశ్వంలోన  నిలిచిపోయెను  నీ  వెలుగు రేఖలు 

ప్రమిదలా  వచ్చావు  నా  పెంకుటింటికి 
పున్నమిలా  మారావు  నా  ముత్యాలపల్లకికి 

- గరిమెళ్ళ గమనాలు 




//గజల్ -5//

స్వచ్ఛమైన   నీచిరునవ్వు  అంటే  నాకిష్టం
వెన్నెలంత   హాయినిచ్చే నీచూపంటే  నాకిష్టం

మధురమైన  నీపలుకులు వినాలంటే  నాకిష్టం
నన్నేమరచి  నీతో మాట్లాడటమంటే  నాకిష్టం

నిన్నేచూస్తూ  మెలకువగా  ఉండాలంటే  నాకిష్టం
నీరూపంచూపే  ప్రతీ  కలంటే  నాకిష్టం

నీవాలుజడలో  కొప్పునఉండే  సంపెంగంటే  నాకిష్టం
నీకాలిమువ్వలు చేసే సవ్వడులంటే  నాకిష్టం 

నావెంటనడిచే  నీజ్ఞాపకాలు  అంటే  నాకిష్టం 
నీకోసం  నేవదిలే  శ్వాసంటే  నాకిష్టం 

నీకోసం   నేరాసిన చిరుకవితంటే  నాకిష్టం 
నీకోసమే  మారిన  నాపేరంటే  నాకిష్టం 

-గరిమెళ్ళ గమనాలు 





//గజల్ -4//

తుళ్ళిపడే  తత్వంలో  ఆరాటం ఉంటుంది
ఎగసిపడే   పరువంలో ఓ  ప్రణయం  పుడుతుంది 

నువు  నిండిన తలపులలో వలపెంతో  దాగున్నది 
చెలిమిలోని సంపదలో సంతోషం ఉంటుంది 

మెత్తనైన కౌగిలిలో విరహాలే పోవునులే 
మధురమైన స్వప్నంలో చెలిరూపం ఉంటుంది 


పరితపించు  నా మనసుకి  నీవిలువే  తెలుస్తుంది 
నిరీక్షించు సమయంలో ఒక దుఃఖం ఉంటుంది ....... 


- గరిమెళ్ళ గమనాలు